డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు

చీడికాడ మండల కేంద్రంలో అరుంధతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి మోర్తా శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ న్యాయ, కార్మిక, రక్షణ, తంతి తపాల, వ్యవసాయ శాఖల మంత్రిగా పలు ఉన్నత పదవులు నిర్వహించారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా దేశానికి ఆహార భద్రత కల్పించడంలో నూతన వంగడాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్