రాజాంలో ఉచితంగా మొక్కల పంపిణీ

బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో పీఎన్పీపీ స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు 8 వేల జీడి, మామిడి, టేకు మొక్కలను గురువారం పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాల రైతులకు ఉచితంగా మొక్కలను అందించారు. ప్రతి మొక్కను జాగ్రత్తగా పెంచుకోవాలని వారు కోరారు. పీఎన్పీపీ అధికారులు ప్రసాద్, లోకేష్, నాయుడు, రాజాం గ్రామ ఎక్స్ ఎంపీటీసీ మారిసా సతీష్, మారిసా శ్రావణ్, మారిసా నరేష్, యాన్నాంసెట్టి రమణ, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్