మేకల దొంగలు అరెస్టు

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం తైపురం గ్రామంలో రైతు వియ్యపు పెద్దరాజు పాక నుండి రెండు మేకలను దొంగిలించిన ఘటనలో పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి, వారి వద్ద నుంచి దొంగిలించిన మేకలను, దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్