మందు బాబు హల్‌చల్

రావికమతం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఒక మందుబాబు బి. యన్ రోడ్డుపై హల్చల్ చేసి ట్రాఫిక్ను నిలిపివేశాడు. పాడేరు - నర్సీపట్నం వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులకు అడ్డంగా కూర్చొని, డబ్బులు ఇవ్వకుండా కదలనని భీష్మించాడు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, మందుబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్