రావికమతం;అత్యంత వైభవంగా శ్రీ మరిడి తల్లమ్మ అమ్మవారి పండుగ

రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో వెంచేసియున్న శ్రీ మరిడి తల్లమ్మ అమ్మవారి పండుగ గురువారం ఘనంగా జరిగింది. ఈ ఏడాది నూతనంగా తయారు చేసిన అమ్మవారి పాదాలను వూరేగింపుగా తీసుకు వెళ్లారు. ఉదయం నుంచే ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో ఈ పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకుంటారు. భక్తులు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్