రావికమతం మండలం టి అర్జపురం పంచాయితీ కోట్నాబెల్లి గ్రామంలో జల్జీవన్ మిషన్ ద్వారా 16 లక్షల 90 వేల రూపాయలు తో వాటర్ ట్యాంక్, ఇంటింటి కులాయి నిర్మాణం చేశారు. అయితే రెండు నెలలు అవుతున్న నేటికీ వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటింటి కొళాయికి నీరు సరఫరా చేయలేదనీ గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం వారంతా వాటర్ ట్యాంక్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వెంటనే వాటర్ ట్యాంక్ ప్రారంభించాలన్నారు.