అపోలో ఫార్మసీలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

విశాఖపట్నంలోని అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కొరకు ఈ నెల 24వ తేదీన (గురువారం) నగరంలోని అపోలో రీజినల్ ఆఫీస్, విశాలాక్షినగర్ నందు ఉదయం 10 గంటల నుండి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్. ఆర్ మేనేజర్ డేవిడ్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ చదివిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని, ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్, జిరాక్స్ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 9154117837 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕