విశాఖలో బైక్ దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గం లోని ఎంవిపి కాలనీలో ఇంట్లో పార్క్ చేసిన వాహనాన్ని గుత్తి తెలియని దొంగలు అపహరించిపోయారు. బండి యజమాని చేతన్ ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సమీపంలోని సీసీ టీవీ పుటేజ్ పరిశీలించారు. బైక్‌ను దొంగలించిన రికార్డు అయింది.