విశాఖపట్నంలోని పెదవాల్తేరు బాబాబజారు వద్ద బుధవారం ఉదయం పోతిన నరసింహనాయుడు (50) అతివేగంగా కారు నడుపుతూ ముందు వెళ్తున్న కారు, ఆటోను ఢీకొట్టాడు. ఆతరవాత పార్కింగ్ చేసిన రెండు ద్విచక్రవాహనాలను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారు టైరు ఊడిపోయింది. గాయపడిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే కారు నడిపిన నరసింహనాయుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.