విశాఖ: పాతడెయిరీ ఫారం ఇందిరాగాంధీ నగర్‌లో గ్యాస్ లీకై మంటలు చెలరేగిన ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పారావు, సత్యవతి, రాజశేఖర్, చంద్రశేఖర్ గాయపడ్డారు. వీరిని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లిన వీరు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి మొత్తం గ్యాస్ లీకై వ్యాపించింది. నాగరాజు లైట్ వెయ్యగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం.