విశాఖలో భారీ వర్షం

అల్పపీడనం కారణంగా విశాఖలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మారిపోయి చల్లటి గాలుల వీస్తున్నాయి. నగరాన్ని పూర్తిగా మబ్బులు కమ్ముకున్నాయి. సాయంత్రం చిరు జల్లులు కురవగా.. రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఓ వైపు చలిగాలులు.. మరో వైపు వర్షం కురవడంతో విశాఖ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. బుధవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత పోస్ట్