విశాఖ బీచ్ భారీగా కోతకు గురైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మంగళవారం ఆర్కే బీచ్ సమీప ప్రాంతం కోతకు గురి కావడంతో కాస్త ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. భారీగా ఇసుక కోతకు గురి అయింది. అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. ఈదురు గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో విశాఖలో వాతావరణం పూర్తిగా మారిపోయింది.