నర్సీపట్నం ఆర్టీసీ డీపోలో హైర్ బస్ ను ఆదివారం అర్ధరాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. సోమవారం ఆర్టీసీ బస్సు ఉదయం నాలుగున్నర గంటలకు తుని వెళ్లాల్సి ఉండగా పార్కింగ్ చేసి ఉంచిన బస్సును దొంగలు ఎత్తుకెళ్లారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల దర్యాప్తు చేసి లోతు గెడ్డ జంక్షన్ బస్సు ఉన్నట్లు గుర్తించారు. దొంగను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.