క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ముద్దు పెట్టిన సెక్యూరిటీ గార్డు

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో క్యాబ్ ఎక్కుతున్న విశాఖ జిల్లాకు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను అకస్మాత్తుగా పక్కకు లాగి ముద్దు పెట్టిన ఘటన కలకలం రేపింది. యువతి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా ఇందిరానగర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ (25)ను గుర్తించి అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕