సిపిఎం సీనియర్ నాయకులు శంకర్రావు తల్లి సావిత్రమ్మ మృతి

సిపిఎం ఆరిలోవ సీనియర్ నాయకులు, మద్దిలపాలెం జోన్ కమిటీ సభ్యులు పి శంకర్రావు తల్లి సావిత్రమ్మ ఆదివారం సాయంత్రం 6 గంటలకు గుండెపోటుతో మరణించారు. ఆమె మరణానికి సిపిఎం విశాఖ జిల్లా కమిటీ, మద్దిలపాలెం జోన్ కమిటీ తరఫున సంతాపాన్ని, శంకర్రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విజయవాడలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఉన్నందున హాజరు కాలేకపోయినా, శంకర్రావును ఫోన్ చేసి పరామర్శించారు. సావిత్రమ్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్