విశాఖలో ఆకతాయిల అరాచకాలు మితిమీరుతున్నాయి. కంచరపాలెం బర్మా కాలనీలో రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు బైక్ తగులబెట్టారు. సోమవారం ఈ సంఘటన వెలుగు చూసింది. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొందరు యువకులు అర్ధరాత్రి వరకు పూటుగా తాగి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.