విశాఖపట్నంలోని ఎన్ఏడీ కొత్త రోడ్ అంబేడ్కర్ నగర్ శాంతినగర్‌లో శనివారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డీజే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాన్స్ చేస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.