వంతెనపై క్రేన్ సామగ్రి పడి ఇద్దరికి గాయాలు

పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకెలపాలెం నుంచి ఫార్మా సిటీ వెళ్లే బ్రిడ్జిపై గుంతల కారణంగా శనివారం రాత్రి  లారీ నుంచి క్రేన్‌కు సంబంధించిన సామగ్రి కింద పడి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ పక్కన బైక్‌పై వెళ్తున్న లంకెలపాలెం వాసులు నూకరాజు, షేక్ మదీనాకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕