జనవరి 4న విశాఖలో జరగనున్న నేవీ ఉత్సవాల్లో భాగంగా గురువారం రిహార్సిల్స్ నిర్వహించారు. ఈ రిహార్సిల్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. నావికాదళ విన్యాసాల్లో భాగంగా కమాండోలు పారాచూట్లతో కిందకు వచ్చే సమయంలో ఒకదానితో ఒకటి ఢీకొనడంతో నావికులు సముద్రంలో పడిపోయారు. వెంటనే స్పందించిన నేవీ సిబ‍్బంది ప్రత్యేక బోట్ల సాయంతో వారిని రక్షించారు.