జీవీఎంసీ జోన్-2 పరిధిలో జూలై 7న నిర్వహించనున్న మరమ్మతుల పనుల వల్ల 10, 11, 12వ వార్డుల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని నీటి సరఫరా ఇంజనీర్ సుధాకర్ తెలిపారు. వెటర్నరీ కాలనీ, రవీందర్ నగర్, కైలాస్ నగర్, డ్రైవర్స్ కాలనీ, ముస్తఫా కాలనీ, చిన్న గదిలి తదితర ప్రాంతాల్లో నీటి పంపిణీ నిలిచిపోతుందని వెల్లడించారు.