మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం శుక్రవారం రీరిలీజ్ అయింది. 35 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల కావడంతో విశాఖలోని పలు థియేటర్లకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సినిమాలోని పాటలు, శ్రీదేవి అందానికి ఫిదా అవుతున్నారు. 4కె వెర్షన్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను వీక్షించడంతో ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనయ్యారు.