కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు 'సంవిధాన్ హత్య దివాస్' సందర్భంగా శనివారం ఆనందపురంలోని కింగ్స్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఉత్తరాంధ్రకు చెందిన ఉద్యమకారులను ఆయన సన్మానించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కులను అణచివేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.