కంచరపాలెం పీఎస్ పరిధిలోని తాటిచెట్లపాలెం, సంజీవయ్య కాలనీ సమీపంలోగురువారం సాయంత్రం యువకుల మధ్య జరిగిన ఘర్షణలో బి.మణికంఠ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పార్కులో మరో యువకుడితో జరిగిన వాగ్వాదం ఈ ఘర్షణకు దారితీసింది. దాడిలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫిఫ్త్ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.