విశాఖలో కారు బోల్తా..ఒకరు మృతి

విశాఖపట్నంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి నుంచి గాజువాక వైపు వస్తున్న కారు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే దువ్వాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్