అక్టోబరు తొలివారం నుంచి ఉద్యమానికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సిద్ధమవుతున్నారు. ఇక కేంద్రంతో తాడోపేడో తేల్చుకొనేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర వాప్యంగా ఆందోళన చేపట్టాలని ఉక్కు పోరాట కమిటీ శనివారం తీర్మానించింది. ఉద్యమంలో విద్యార్థులు, రైతులు, కార్మికులు కలిసిరావాలని పిలుపునిచ్చింది. అధికారంలోకిరాగానే మాట మార్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నాయి.