గాజువాకలోని షీలా నగర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఒక కియా సోనెట్ కారు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. అయితే, అప్రమత్తమైన తండ్రి, కూతురు సమయానికి కారులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎన్ఏడీ కొత్త రోడ్ నుంచి ఉమ్మలాడ వైపు వెళ్తున్న ప్రభాకర్ (కారు నంబరు ఏపీ 39 ఎం జె 2295) షీలా నగర్ సిగ్నల్ పాయింట్ వద్దకు రాగానే, కారు ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించారు.