విశాఖలో జోరు వాన.. పెరిగిన చలి

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విశాఖలో 3 రోజుల నుంచి ఎడతెరిపిలేని వాన కురుస్తోంది. శనివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం కూడా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. చలి తీవ్రత కూడా పెరిగింది. దీంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్