విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ను కార్మికులు ముట్టడించారు. 4200 మంది కాంట్రాక్ట్ సిబ్బంది తొలగింపుపై కార్మిక వర్గాలు భగ్గుమన్నాయి. వేలాది మంది కార్మికులు కుటుంబ సభ్యులతో సహా ఆందోళన నిర్వహించారు. ఉక్కు అడ్మిన్ భవనం అద్దాలను నిరసన కారులు ధ్వంసం చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.

సంబంధిత పోస్ట్