గాజువాకలో జివియంసి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై అగనంపూడి జోనల్ కమిషనర్ మనీషా త్రిపాఠికి వినతి పత్రం సమర్పించారు. జివియంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ సిఐటియు నేత గొలగాని అప్పారావు, గత ఐదు నెలలుగా పిండి లక్ష్మి జీతం వేరే కార్మికురాలి ఖాతాలో జమ అవుతోందని, అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. 2022 నుంచి మిస్సింగ్ జీతాలు, సప్లిమెంటరీ బిల్లు పెట్టిన కార్మికుల ఖాతాల్లో జమ కావడం లేదని ఆరోపించారు. 77, 79, 85 వార్డుల పారిశుద్ధ్య కార్మికుల మిస్సింగ్ జీతాలపై కమిషనర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, సత్యవతి కూడా పాల్గొన్నారు.