విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో షీలానగర్ నుండి పోర్ట్ కనెక్టివిటీ రోడ్డులోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. ద్విచక్ర వాహనాన్ని ట్రాలర్ లారీ ఢీకొనడంతో పరవాడకు చెందిన 45 ఏళ్ల అశోక్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ మరియు మల్కాపురం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.