విశాఖ: 'ప్రశ్న రావణ్'పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వీరమహిళలు!

జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బచ్చలకూర జోసెఫ్ అలియాస్ 'ప్రశ్న రావణ్'పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన వీరమహిళా విభాగం డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీని కలిసి వారు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఒక రాతపూర్వక ఫిర్యాదును శుక్రవారం అందజేశారు. సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్‌పై ఇలాంటి అసభ్యకరమైన, వ్యక్తిగత దూషణలకు దిగడం సహించరాని విషయమని వీరమహిళలు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్