విశాఖ జిల్లా గాజువాక మండలం 71వ వార్డు కుంచుమాంబ కాలనీలో శ్రీ సత్య సాయిబాబా పల్లకి ఊరేగింపు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భక్తులు సాయి నామస్మరణ జపిస్తూ కుంచుమాంబ కాలనీ, శ్రామిక నగర్, దత్త సాయి నగర్, శ్రీనగర్ రైల్వే క్వార్టర్స్ మొదలగు ప్రాంతాలకు కాలినడకన సాయిబాబాని పల్లకిపై మోస్తూ, తమ భక్తిని చాటుకున్నారు.