మాడుగుల పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ

అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని కె. జె. పురం, వీరవిల్లి, ముగుందపురం, పోతనపూడి అగ్రహారం తదితర పంచాయతీలలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మండల ప్రత్యేకాధికారి వి. రవీంద్రనాథ్, ఎంపీడీఓ కె. అప్పారావు లబ్ధిదారులకు నేరుగా పింఛను సొమ్మును అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, పింఛన్ల పంపిణీ ప్రక్రియ వేగంగా  పారదర్శకంగా జరిగేలా పంచాయతీ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕