పాడేరు నుంచి మాడుగుల వైపు ఘాట్ రోడ్లో వస్తున్నా బొలెరో వాహనము ఏపీ 39 యు ఎల్ 0327 బ్రేకులు ఫెయిల్ అయి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో 3వ మళ్లింపు దరి లోయలో బోల్తా పడింది. దాంట్లో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని అగ్నిమాపక వాహనంలో మాడుగుల ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు నిర్వహించి అత్యవసర చికిత్సకు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి ఆదివారం ఉదయం తరలించారు.