మాడుగుల శివారు గిరిజన గ్రామమైన తుమ్మలపాలెంలో గురువారంరాత్రి గిరిజనులు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. తాచేరు జలాశయం దాటుకొని ఆ గ్రామానికి కాలినడకన చేరుకోవాలి. ఆ గ్రామానికి రహదారి లేదు దేవాలయం లేదు. వేరే గ్రామాలతో సంబంధం ఉండదు అలాంటి గ్రామంలో పౌర్ణమి వెన్నెల లో దీపాన్ని దేవుడిగా భావించి పౌర్ణమి వేడుకలు నిర్వహించుకుని ఏకనామంతో జపించి పూజ నిర్వహించుకున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరినామమని చెప్పాలి