పాఠశాల భవనాలు తొలగింపుకు ఎంపీడీఓ ఆదేశాలు

అనకాపల్లి జిల్లా, మాడుగుల మండల పరిధిలో ప్రమాదకరంగా మారిన, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను పరిశీలించి, సత్వరమే తొలగిస్తామని ఎంపీడీఓ కె. అప్పారావు స్పష్టం చేశారు. మండల ప్రత్యేకాధికారి వి. రవీంద్రనాథ్‌తో కలసి ఆయన పలు గ్రామాల్లో గురువారం పర్యటించారు. పోతనపూడి అగ్రహారం గ్రామంలోని శిథిల పాఠశాల భవనాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు, స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాన్ని శనివారం నాటికి పూర్తిగా తొలగించాలని పంచాయతీ అభివృద్ధి అధికారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్

✕
✕