ఎస్బీఐ ఏటీఎం వద్ద విద్యుత్ మీటర్‌కు అగ్నిప్రమాదం

నర్సీపట్నం మున్సిపాలిటీ రామారావుపేటలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద సోమవారం విద్యుత్ మీటర్‌కు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన కొందరు వెంటనే స్పందించి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్