నర్సీపట్నం మున్సిపాలిటీ బిసి కాలనీలో బుధవారం గీసాల కన్నయ్య అనే వృద్ధుడిపై బుధవారం ఎద్దు దాడి చేసింది. రైతులు వేరే ప్రాంతం నుంచి ఎద్దును కొనుగోలు చేసి ఇక్కడ వదిలేయడంతో అది ప్రజల మీద దాడి చేస్తుందని స్థానికులు తెలిపారు. గాయపడిన వృద్ధుడిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎద్దు దాడిలో వృద్ధుడికి కాలు, చేతి మీద బలమైన గాయాలు అయ్యాయి. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.