నర్సీపట్నంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో బాధపడుతున్న ప్రజలకు ఈ వర్షం తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. అయితే భారీ వర్షంతో మామిడి తోటలకు నష్టం వాటిల్లే అవకాశముందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వడగళ్ల వల్ల కొన్ని ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి.