చింతపల్లి గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సీదెరి అనిల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. హాస్టల్ గదిలో శుక్రవారం ఉదయం 8 గంటలకు సహచర విద్యార్థులు గమనించి కళాశాల సిబ్బందికి సమాచారం అందించారు. పెదబయలు మండలం మొయ్యలగుమ్మి గ్రామానికి చెందిన అనిల్ మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.