బీచ్ లో గల్లంతై యువకుడు మృతి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి ఏడాది చదువుతున్న అగస్తీమ, యశ్వంత్ అనే ఇద్దరు విద్యార్థులు ఆదివారం సముద్ర స్నానానికి వెళ్లి మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామానికి చెందిన అగస్తీమ, విజయనగరం జిల్లా మెరకముడిదాంకు చెందిన యశ్వంత్, వేరే జిల్లాల నుంచి చదువుకోవడానికి వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు మృతదేహాలను గుర్తించి, కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్