రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాన్వాయ్ వెళ్తుండగా విశాఖలోని నోవోటల్ గేట్ వద్దకు ఆమెను కలిసేందుకు వచ్చిన ఓ యువకుడు కలకలం సృష్టించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి, యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ సంఘటనతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.