భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 17వ తేదీన విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అర్ధరాత్రి 12:01 గంటలకు సింగపూర్ నుంచి వచ్చే విమానం ఇక్కడికి చేరుకునే తొలి విమానంగా రికార్డు సృష్టించనుంది. అనంతరం అదే విమానం తిరిగి సింగపూర్‌కు మొదటి సర్వీస్‌గా బయలుదేరుతుంది. ఈ నెల 17వ తేదీ నుంచే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచే షెడ్యూల్డ్ కమర్షియల్ విమాన సేవలు నిలిచిపోనున్నాయి.