విశాఖపట్నంలోని జ్ఞానాపురం ప్రాంతంలో నేరాలను అరికట్టడానికి పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ విశాఖ దక్షిణ ఇన్‌ఛార్జి సీతంరాజు సుధాకర్ తన సొంత నిధులతో ఈ అవుట్ పోస్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.