ముంచింగిపుట్టు మండలంలోని బంగారుమెట్టు పంచాయతీ పరిధిలో కుజబంగి జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రామకృష్ణశనివారం తెలిపారు. అనుమానాస్పదంగా వచ్చిన కారు తనిఖీలో ప్యాకింగ్ చేసిన గంజాయి బయటపడింది. మహారాష్ట్రకు చెందిన రవి మున్నాలాల్ జైస్వాల్, స్వప్నిల్ జయప్రకాష్ రానే, అల్లూరి జిల్లాకు చెందిన లక్ష్మణ్ దాస్‌లను అరెస్ట్ చేయగా, సీసా బిస్నాద్, కిలో రవికుమార్ పరారీలో ఉన్నారు.