అల్లూరి సీతారామరాజు జిల్లాలో పదో తరగతి పరీక్షా ఫలితాలు నిరాశపరిచాయి. మొత్తం 57.12 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 11,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 6,508 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 5,048 మంది పరీక్షలు రాయగా 2,625 మంది పాస్ అయ్యారు. బాలికలు 6,346 మంది హాజరుకాగా 3,883 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఫలితాల్లో బాలికలే మెరుగైన ప్రదర్శన కనబర్చారు. జిల్లాలో తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.