పాస్టర్ కుటుంబంపై అట్రాసిటీ కేసు

జీకే వీధి మండలం ఏనుగుబైలు గ్రామంలో 8 ఏళ్ల బాలికపై దొంగతనం ఆరోపణలతో చర్చి పాస్టర్ కుటుంబం చిత్రహింసలకు పాల్పడిన ఘటనలో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇంట్లో రూ. 10 వేలు కనిపించకపోవడంతో బాలికే దొంగిలించిందని అనుమానించి, అట్లకాడతో చేతులపై కాల్చినట్లు ఆరోపణలున్నాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పాస్టర్ జయరాజ్, ఆయన భార్య, మరో మహిళపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. కేసు దర్యాప్తును చింతపల్లి ఏఎస్పీ చేపట్టనున్నారు.

సంబంధిత పోస్ట్