అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డు మార్గంలో 12వ మైలు సమీపంలో బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. మైదాన ప్రాంతం నుంచి లోడుతో వస్తున్న వాహనం మొదటి కార్నర్ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వాహనం ముందు భాగం ధ్వంసం కావడంతో, లోడును మరో వాహనంలోకి మార్చి తరలించారు.