పాడేరులో కారు బోల్తా

పాడేరు సమీపంలో గురువారం కాఫీ బోర్డు మలుపు వద్ద కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకువెళ్లింది. విశాఖ నుంచి పాడేరు వైపు వస్తున్న ముగ్గురు ప్రయాణికులతో ఉన్న కారు ఈ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదకర మలుపు వద్ద రక్షణ గోడలు లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్&బి అధికారులు స్పందించి వెంటనే రక్షణ గోడలు నిర్మించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్