జి. మాడుగుల మండలం భీరం పంచాయతీ పరిధిలోని అనర్బ గ్రామ యువతకు TR హ్యూమన్ రైట్స్ & యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జి. మాడుగుల మండల హ్యూమన్ రైట్స్ చైర్మన్ కొర్ర చిన్నబ్బాయి, మండల వైస్ చైర్మన్ గొల్లోరి లక్ష్మణ్, అసోసియేషన్ సభ్యులు, టీమ్ పాల్గొని యువతకు కిట్లను అందజేశారు. గ్రామీణ యువతలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడం, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కొర్ర చిన్నబ్బాయి తెలిపారు.